కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల తలెత్తిన అంతర్గత అసంతృప్తులపై అధిష్టానం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఈ క్రమంలో తెలంగాణ నూతన ఏఐసీసీ ఇంచార్జ్ బీఎం సందీప్ కుమార్ (BM Sandeep) తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో (Revanth Reddy) ప్రజా భవన్ లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గంటకు పైగా సాగిన ఈ భేటీలో ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యవహారాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.
గత కొద్దిరోజులుగా నిధుల కేటాయింపు, అధికారుల తీరుపై సొంత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు చేసిన బహిరంగ వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే వారితో వేర్వేరుగా సమావేశమై అభిప్రాయాలు సేకరించిన సందీప్ కుమార్, ఆ చర్చల సారాంశాన్ని సీఎం రేవంత్ (Revanth Reddy) రెడ్డికి వివరించినట్లు సమాచారం అందుతోంది. అలాగే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులు, ఇతర అసంతృప్త నేతలతో తాను జరిపిన సంప్రదింపుల వివరాలను కూడా సందీప్ కుమార్ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం అందుతోంది.
Also Read : హైకోర్టు సంచలన తీర్పు.. సీపీ, డీసీపీకి జైలు శిక్ష!
Follow Us On: Youtube

