బాలికల రక్షణకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : సివిల్ జడ్జి

కలం, మధిర : బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, దాడులను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మధిర (Madhira) కోర్టు సీనియర్ సివిల్ జడ్జి ఎన్. ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక శ్రీనిధి డిగ్రీ కళాశాల లో నిర్వహించిన బాలికల భద్రత, లైంగిక వేధింపుల నివారణ, మాదక ద్రవ్యాల నిరోధక చట్టాలపై అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బాలికలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన POCSO Act – 2012 గురించి వివరించారు. 18 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఈ చట్టం రక్షణ కల్పిస్తుందని, లైంగిక వేధింపులు, లైంగిక దాడులు, తీవ్రమైన లైంగిక నేరాలకు సంబంధించి చట్టంలో కఠినమైన శిక్షలు ఉన్నాయని తెలిపారు.

బాలికలకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఆమెకు అండగా నిలవాలని, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, అత్యవసర సేవల నంబర్ 112 గురించి వివరించారు. బాలికల భద్రత అనేది కేవలం కుటుంబ బాధ్యత మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ అనిల్ కుమార్ నెహ్రూ, జూనియర్ కళాశాల డైరెక్టర్, ప్రిన్సిపాల్ టి. రమేశ్, బార్ ప్రెసిడెంట్ చావలి రామరాజు, న్యాయవాదులు పీ. కృష్ణా రావు, ఎం.సతీశ్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కే.యశోద, పీఎల్ వీలు వెంకట్, వెంకటేశ్వర్లు, సుజాత, సునీత పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>