రామాయణ చిత్ర బృందానికి అమిత్ షా అభినందనలు

కలం, వెబ్ డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన రామాయణ పార్ట్ 1 చిత్ర బృందాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ప్రత్యేకంగా కలిసి అభినందించారు. భారతీయ ఇతిహాసాన్ని ప్రతిష్టాత్మకంగా వెండితెరపై ఆవిష్కరించినందుకు చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితీష్ తివారీ, నటీనటులు రణబీర్ కపూర్, సాయి పల్లవి, సహ నిర్మాత నీరజ్ సంఘైలను ఆయన ప్రశంసించారు.

నవంబర్ 5న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.2,000 కోట్ల మైలురాయి దిశగా దూసుకెళ్తోంది. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచిన ఈ సినిమా విజయోత్సాహంలో భాగంగా రాముడి పాత్ర పోషించిన రణబీర్ కపూర్, దర్శకుడు నితీష్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా బుధవారం ఢిల్లీలోని చారిత్రాత్మక గురుద్వారా బంగ్లా సాహిబ్ ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ ఇతిహాస చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటించారు. జటాయువు పాత్రకు అనుపమ్ ఖేర్ గాత్రదానం చేయగా, ఏఆర్ రెహమాన్ హన్స్ జిమ్మర్ సంగీతం అందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>