రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు.. విజేతగా ఖమ్మం జట్టు!

​కలం, ఖమ్మం బ్యూరో: గిరిజన ఏజెన్సీ ప్రాంతమైన చర్లలో రాష్ట్ర స్థాయి అండర్‌-17 బాలుర వాలీబాల్ పోటీలు జరిగాయి. ముగింపు వేడుకలకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను ప్రారంభించిన మంత్రి.. విజేతగా నిలిచిన ఉమ్మడి ఖమ్మం జట్టును అభినందించి బహుమతులు అందజేశారు. ​ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని దిశానిర్దేశం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో రాబోయే మూడు, నాలుగు ఏళ్లలో తెలంగాణను క్రీడారంగంలో దేశానికే ఆదర్శంగా నిలుపుతామన్నారు. గతంలో ఇబ్బందులు ఎదురైన చర్ల ప్రాంతంలో ప్రశాంత వాతావరణంలో పోటీలు నిర్వహించేలా మైదానం ఏర్పాటు చేసిన పోలీసులను మంత్రి పొంగులేటి అభినందించారు. అంతకుముందు కుదునూరులో సీసీ రోడ్లు, రూ.1.50 కోట్లతో నిర్మించనున్న గిరిజన బాలికల వసతి గృహ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీఓ రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>