ముంబై కెప్టెన్సీపై బిగ్ హింట్..?

క‌లం, స్పోర్ట్స్: ఐపీఎల్ 2027కు ముందు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్సీపై ఆసక్తికర చర్చ మొదలైంది. రోహిత్ శర్మకు మళ్లీ నాయకత్వ బాధ్యతలు అప్పగించనున్నారా? బుధవారం ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు ఈ ఊహాగానాలకు కారణమైంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ముంబై ఇండియన్స్ ఓ చేయి జట్టు క్యాప్ పట్టుకున్న యానిమేటెడ్ చిత్రాన్ని షేర్ చేసింది. ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు. అయినా అభిమానులు దీన్ని రోహిత్‌తో ముడిపెడుతున్నారు. 2013లో ముంబై తొలి టైటిల్ గెలిచిన సందర్భాన్ని, 2024 టీ20 ప్రపంచకప్ విజయానంతరం రోహిత్ సంబరాలను గుర్తు చేసుకుంటున్నారు.

2024లో రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాకు ముంబై కెప్టెన్సీ ఇచ్చింది. అయితే ఐపీఎల్ 2027కు ముందు ట్రేడ్‌లో హార్దిక్ పంజాబ్ కింగ్స్‌కు వెళ్లాడు. పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ముంబైలో చేరాడు. దీంతో కెప్టెన్సీ ఎవరికి దక్కుతుందనే చర్చ మొదలైంది. రోహిత్ నాయకత్వంలో ముంబై 2013, 2015, 2017, 2019, 2020లో ఐదు టైటిళ్లు గెలిచింది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ పేర్లు కూడా కెప్టెన్సీ రేసులో వినిపించినా.. అనుభవం, విజయాల రికార్డుతో రోహిత్ ముందున్నట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>