కలం, హనుమకొండ: సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల ఆచూకీ గుర్తించి రికవరీ చేసినట్లు వరంగల్ సీపీ శ్వేత (Warangal CP Shwetha) తెలిపారు. కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న 104 ఫోన్లను సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి రికవరీ చేశారు. బుధవారం పోలీస్ కమిషనర్ శ్వేత బాధితులకు ఈ ఫోన్లను అందజేశారు. సీసీఎస్ ఏసీపీ సదయ్య, ఎస్హెచ్ఓ రాఘవేందర్ పర్యవేక్షణలో కానిస్టేబుళ్లు ఎస్.రాములు, జితేందర్ ప్రత్యేక చొరవ చూపారు. ఫోన్లు తిరిగి పొందిన బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. మొబైళ్ల రికవరీలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని సీపీ అభినందించారు.

