29న కరీంనగర్ టీటీడీ కల్యాణ మండపంలో కార్తీక దీపోత్సవ వేడుక

కలం, కరీంనగర్ బ్యూరో : కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్న కార్తీక దీపోత్సవ (Karthika Deepotsavam) కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను బుధవారం కరీంనగర్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో కార్తీక దీపోత్సవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పి. సుగుణాకర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పి. సుగుణాకర్ రావు మాట్లాడుతూ.. కార్తీక మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసమని, భక్తి భావాన్ని, ఆధ్యాత్మిక చింతనను, సనాతన ధర్మ సంప్రదాయాలను ప్రజల్లో మరింతగా పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

ఈ నెల 29వ తేదీన సాయంత్రం 5 గంటలకు గాంధీ రోడ్డులోని టీటీడీ కల్యాణ మండపంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తులు, ప్రజలు, ధార్మిక సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పి. సుగుణాకర్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్తీక దీపోత్సవ సమితి సభ్యులు గంప జగన్, దుర్గం మారుతి, తాడూరి బ్రహ్మం, ముప్పిడి సునీల్, గుడిపాటి జితేందర్ రెడ్డి, నగునూరి లక్ష్మణ్, కూరగాయల తిరుపతి, పిట్ల స్వామి, కామారపు నరహరి స్వామి, దేవి శెట్టి హనుమాన్, ఈగ మల్లేశం, ఏవి సతీష్, సుమన్, బ్రిడ్జ్ మోహన్ ఇతర దీపోత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>