కలం, భైంసా: రైతులు తమ పంటలను నిల్వ చేసుకునేందుకు గోదాముల నిర్మాణం చేపడుతున్నట్లు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్(Pawar Ramarao Patel) అన్నారు. భైంసా మండలం తిమ్మాపూర్ గ్రామంలో వీబీజీ రాంజీ పథకం కింద రూ. 30 లక్షలతో నిర్మించనున్న గోదాం నిర్మాణానికి బుధవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు పంటల నిల్వ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా గ్రామాల్లో గోదాముల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందన్నారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు అందిస్తోందని పేర్కొన్నారు. రైతులకు ఉపయోగపడే మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంజీవ్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆనందరావు పటేల్, మాజీ ఎంపీపీ రజాక్, బీజేపీ మండల అధ్యక్షురాలు, దేగాం సర్పంచ్ సిరం సుష్మారెడ్డి, సర్పంచులు శ్యాంరావు పటేల్, వినోద్, మాజీ సర్పంచులు రమేష్, మాజీ ఎంపీటీసీ అశోక్, సీనియర్ నాయకులు ధర్మగౌడ్, స్థానిక నాయకులు దేవన్న, దుబాయ్ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

