హెచ్ఎండీఏ కార్యాలయం ముట్టడి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అరెస్ట్!

కలం, వెబ్ డెస్క్ : నగరంలోని ప్రభుత్వ భూముల వేలంపాటపై విపక్షాలు భగ్గుమన్నాయి. కూకట్‌పల్లి, మియాపూర్, మూసాపేట ప్రాంతాల్లోని విలువైన భూములను వేలం వేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ నాయకులు అమీర్‌పేటలోని హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు (HMDA Protest).

ప్రజా అవసరాల కోసం సేకరించిన భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టవద్దని మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఈ నెల 27న నిర్వహించనున్న HMDA ఈ-వేలాన్ని తక్షణమే రద్దు చేయాలని నిరసనకారులు నినాదాలు చేశారు. అంతకుముందు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యాలయం నుంచి బాధితులు, కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులు భారీ సంఖ్యలో ర్యాలీగా తరలివచ్చారు.

అమీర్‌పేటలోని HMDA కార్యాలయం వద్ద ఆందోళన ఉధృతం కావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులను పోలీసులు అరెస్ట్ చేసి క్యాంపు కార్యాలయానికి తరలించారు. ఈ ఘటనతో అమీర్‌పేట ప్రాంతంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>