కలం, వెబ్ డెస్క్: యూఏఈలోని అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం (UAE Road Accident) చోటు చేసుకుంది. రస్ అల్ ఖైమాలో బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 13 మంది మరణించారు. 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో భారతీయులు కూడా ఉన్నట్లు దుబాయ్‌లోని ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని.. స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు వివరించింది. వారికి అవసరమైన సాయం అందిస్తామని తెలిపింది. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు వివరించింది. టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తెచ్చామని.. అవసరమైన సమాచారం తెలుసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు యూఏఈ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మృతులను గుర్తు పట్టే ప్రక్రియ కొనసాగుతోందని వివరించింది.

