రూ.10 వేల కోట్లతో 5 నెలల ఎల్‌నినో సన్నద్ధత: ఉత్తమ్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ క్లైమేట్‌ కాంక్లేవ్‌ కేవలం చర్చలకే పరిమితం కాకుండా, కరువు సవాళ్లకు అమలు చేయగల, శాస్త్రీయంగా నిరూపితమైన పరిష్కారాలను సూచించే వేదికగా నిలవాలని అధికారులను మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (Uttam Kumar Reddy) ఆదేశించారు. కరువును తట్టుకునే వ్యవస్థల నిర్మాణం, నీటి భద్రత, సుస్థిర వ్యవసాయం, ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యలపై కాంక్లేవ్‌లో చర్చ జరగాలన్నారు.

ఈ మేరకు హైదరాబాద్ లో మంగళవారం క్లైమేట్‌ కాంక్లేవ్‌ ఏర్పాట్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌లో భాగంగా ఈ కాంక్లేవ్‌ ను నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కార్యక్రమ రూపకల్పన, నిపుణుల భాగస్వామ్యం, ఇన్వెస్టర్స్ తో సప్రదింపులు, వివిధ అంశాలపై రూపొందిస్తున్న ప్రదర్శనలు, ఆడియో–విజువల్‌ కంటెంట్‌పై చర్చించారు.

ప్రధానంగా సీఎం రేవంత్‌ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా సుమారు రూ.10 వేల కోట్ల అంచనా వ్యయంతో రూపొందిస్తున్న 5 నెలల ఎల్‌నినో సన్నద్ధత కార్యక్రమాన్ని ప్రదర్శించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంక్రాంతి తరువాత ప్రతి నెలా దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన పనులను అమలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు..

ఈ కార్యక్రమంలో చెరువులు, వాగులు, కాలువల పునరుద్ధరణ, భూగర్భ జలాల రీఛార్జ్‌, వర్షపు నీటి సంరక్షణ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల పరిరక్షణ పనులను జరుగనున్నాయి. నీటిపారుదల, పంచాయతీరాజ్‌ శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. వ్యవసాయ పనులు తగ్గే కాలంలో గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించడం కూడా ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాల్లో ఒకటని మంత్రి వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>