దేవరకోటలో వైభవంగా ఉంజల్ సేవ.. సహస్ర దీపాలంకరణ

కలం, నిర్మల్: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని దేవరకోట పురాతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం (Devarakota Temple)లో మంగళవారం ఉంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ఉయ్యాలలో ఆసీనులను చేసి ఉంజల్ సేవ నిర్వహించారు. అనంతరం సహస్ర దీపాలతో ఆలయ ప్రాంగణాన్ని అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి సేవలను వీక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిరోజూ నిర్వహించే ఉంజల్ సేవ తరహాలోనే నిర్మల్ తిరుపతిగా పేరుగాంచిన దేవరకోట ఆలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>