కలం, వలిగొండ: కార్తీక పౌర్ణమి పౌర్ణమి పురస్కరించుకుని వలిగొండ (Valigonda) మండలంలోని మత్స్యగిరి గుట్ట, భీమలింగం, త్రిశక్తి క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. వలిగొండ పట్టణ కేంద్రంలోని త్రిశక్తి క్షేత్రంలో కార్తీక దీపోత్సవం నిర్వహించారు. త్రివేణి సంగమమైన భీమ లింగం దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. మత్యాద్రిలో భక్తులు పెద్ద ఎత్తున సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి చక్రతీర్థం నిర్వహించారు. పౌర్ణమివేళ దీపకాంతుల్లో భక్తులు పరవశించిపోయారు. మహాదేవుని అనుగ్రహార్థం దీపం వెలిగించి దైవ స్మరణ చేశారు.

