సమాజ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం : ‎ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

‎కలం, మిర్యాలగూడ : సమాజ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని, విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లో ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (MLA Bathula Laxma Reddy) ఆకాంక్షించారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన మాదిగ ఉద్యోగుల సమాఖ్య డివిజన్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమాఖ్య ప్రతినిధులు, ఉద్యోగులతో ఎమ్మెల్యే ఆత్మీయంగా ముచ్చటించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, విద్యా అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని భావితరాలకు ఉజ్వల భవిష్యత్తును అందించాలని పిలుపునిచ్చారు. ఈ ఆత్మీయ సమ్మేళనం ఉద్యోగుల మధ్య పరస్పర ఐక్యత, స్నేహభావం, సామాజిక చైతన్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, సమాఖ్య ప్రతినిధులు, ఉద్యోగులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>