కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవనంలో మాదిగ ఉద్యోగుల సమైక్య సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రావు (Babu Jagjivan Ram) విగ్రహ ఏర్పాటుపై విస్తృతంగా చర్చించారు. విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు నూతన అడ్‌హాక్ కమిటీని ఎన్నుకున్నారు.
గౌరవ అధ్యక్షుడిగా డీసీసీ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు గాజుల రవికుమార్, అధ్యక్షుడిగా విశ్రాంత ఉపాధ్యాయుడు పడిగెల రాజేశ్వర్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొరిపెల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా తెడ్డు లింగన్న, కోశాధికారిగా గడ్చందా ముత్యం, సంయుక్త కార్యదర్శిగా బోనగిరి కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కొండమడుగు గంగాధర్, వన్నెల భూమన్న, గోనే మాణిక్యం, సొన్న గంగాధర్, రత్నాపురం లక్ష్మణ్, సలహాదారులుగా లక్ష్మణస్వామి, లక్ష్మయ్య, పడిగెల ఎల్లన్న, గోనెల గజ్జరాంలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్‌రావు విగ్రహ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టి, సంఘటితంగా ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు.
Also Read : కేఎల్ రాహుల్ రికార్డు బద్దలు కొట్టిన ఆర్యవీర్!
Follow Us On : WhatsApp

