తెలంగాణలో చిన్నారులు, మహిళల్లో రక్తహీనత అధికం.. ఐసీఎంఆర్ సర్వేలో వెల్లడి

కలం, వెబ్‌ డెస్క్‌ : తెలంగాణలో చిన్నారులు, మహిళల్లో రక్తహీనత (Anemia) సమస్య ఆందోళనకరంగా ఉన్నట్లు ఐసీఎంఆర్‌-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) తాజాగా విడుదల చేసిన ‘సంపద’ జాతీయ సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో ఐదేళ్లలోపు పిల్లల్లో దాదాపు సగం మంది, పునరుత్పత్తి వయసు మహిళల్లో 54 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు నివేదిక పేర్కొంది. 2023–25 మధ్య దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వే ప్రకారం, తెలంగాణలో 12–59 నెలల చిన్నారుల్లో రక్తహీనత 47.4 శాతంగా నమోదైంది.

జాతీయ సగటు 41.8 శాతంతో పోలిస్తే ఇది ఎక్కువ. 15–49 ఏళ్ల మహిళల్లో రక్తహీనత 54 శాతంగా ఉండగా, జాతీయ సగటు 55.9 శాతంతో పోలిస్తే కొంత తక్కువగా ఉంది. అయితే 5–9 ఏళ్ల పిల్లల్లో రక్తహీనత 23.8 శాతమే ఉండటం ఊరటనిచ్చే అంశం. పురుషుల్లోనూ పరిస్థితి మెరుగ్గా ఉంది. 20–59 ఏళ్ల వారిలో 12.5 శాతం మందికే రక్తహీనత ఉన్నట్లు తేలింది. వృద్ధుల్లో కూడా జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణ గణాంకాలు తక్కువగా నమోదయ్యాయి.

35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 183 జిల్లాల్లో ఈ సర్వే చేపట్టారు. ఈసారి సిరల నుంచి రక్త నమూనాలు సేకరించి ఆధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహించారు. చిన్నారులు, మహిళల్లో రక్తహీనత తగ్గించేందుకు పోషకాహారం, ఆరోగ్య కార్యక్రమాలపై మరింత దృష్టి అవసరమని ఈ నివేదిక సూచిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>