ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో రహదారి ప్రమాదాలకు అడ్డుకట్ట వేసి, ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ‘డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ’ (AP Road Safety) పేరుతో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం కేంద్రంగా ఈ కొత్త డైరెక్టరేట్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. డీజీపీ నియంత్రణలో పనిచేసే ఈ విభాగానికి ఐజీ స్థాయి అధికారి డైరెక్టర్‌గా, డీఐజీ స్థాయి అధికారి సహాయకుడిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత కోసం ఏర్పాటు చేయనున్న ఈ ప్రత్యేక డైరెక్టరేట్‌లో ప్రస్తుత పోలీస్ శాఖలోని సిబ్బంది నుంచి గరిష్ఠంగా 75 మందిని నియమించనున్నారు.

మరోవైపు, రాష్ట్రంలోని విజయనగరం, విశాఖపట్నం, పల్నాడు జిల్లాల్లో జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనల సమాచారం అందిన వెంటనే ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడి, సహాయక చర్యల వివరాలు తెలుసుకున్నారు. పోలీస్, రవాణా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఈ మూడు ప్రమాదాలకు గల కారణాలపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని, భవిష్యత్తులో ఇలాంటి విషాద ఘటనలు జరగకుండా తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

Also Read : తెలుగు రాష్ట్రాల్లో మారనున్న వాతావరణం.. పలు జిల్లాలకు వర్ష సూచన!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>