రాజరాజేశ్వర స్వామి ఆలయంలో విజయలక్ష్మి, రాంకిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు

కలం, సోన్: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సోన్ (Soan) మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీశ్రీశ్రీ గొడిసెర్యాల రాజరాజేశ్వర స్వామి దేవస్థానం (Raja Rajeshwara Swamy Temple) లో మంగళవారం మాజీ జడ్పీ చైర్‌‌పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి రాంకిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు సదానంద స్వామి వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందజేశారు. స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏకబిల్వం మొక్కను నాటారు. శివుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాఫ్రాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ సాయిరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>