వాట్సాప్‌లో విద్యార్థినికి వేధింపులు.. లెక్చరర్‌కు విద్యార్థుల దేహశుద్ధి!

కలం, వెబ్ డెస్క్: సంగారెడ్డి జిల్లాలోని పటేల్‌గూడ ఎల్లంకి(Eellanki) పాలిటెక్నిక్ కాలేజీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థినిని వాట్సాప్‌లో వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంగ్లీష్ లెక్చరర్‌పై తోటి విద్యార్థులు దాడి చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినికి లెక్చరర్ రవి వాట్సాప్‌లో అసభ్యకరమైన మెసేజ్‌లు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ప్రతిరోజూ తనతో చాటింగ్ చేయాలంటూ వేధించినట్లు సమాచారం. ఈ క్రమంలో విద్యార్థినికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్ స్క్రీన్‌షాట్లను చూసిన తోటి విద్యార్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. లెక్చరర్‌ను నిలదీసి దాడి చేశారు.

దీంతో కాలేజీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న అమీన్‌పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. లెక్చరర్ రవిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>