కలం, మధిర: ఖమ్మం జిల్లా వైరా సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవే ఎగ్జిట్ వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Greenfield Highway Accident) లో హైదరాబాద్‌కు చెందిన దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌కు చెందిన కోటా కిషోర్ రెడ్డి, ఆయన భార్య లావణ్య, కుమారుడు ప్రణీత్ ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్లారు. దైవదర్శనం అనంతరం వీరంతా కారులో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. ప్రయాణంలో భాగంగా వైరా సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవే ఎగ్జిట్ వద్దకు రాగానే, అక్కడ ఆగి ఉన్న లారీని వీరి కారు అదుపుతప్పి బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు కాగా, కిషోర్ రెడ్డి, లావణ్య అక్కడికక్కడే మృతి చెందారు. వీరి కుమారుడు ప్రణీత్ తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, తీవ్రంగా గాయపడిన ప్రణీత్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తూ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : కౌశిక్ రెడ్డి వ్యవహారం.. 28న ఎథిక్స్ కమిటీ కీలక భేటీ!
Follow Us On : WhatsApp

