మార్నింగ్ వాక్‌లో విద్యార్థులతో ముధోల్ ఎమ్మెల్యే ఆత్మీయ పలకరింపు

కలం, బైంసా : బైంసా పట్టణంలో మంగళవారం ఉదయం ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (MLA Pawar Rama Rao Patel ) మార్నింగ్ వాక్ సందర్భంగా విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. ఉదయం నడకకు వెళ్లిన ఆయనకు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఎదురుకావడంతో వారితో కొద్దిసేపు ఆత్మీయంగా గడిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల చదువు, ఆరోగ్యం తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నతనం నుంచే మంచి అలవాట్లు అలవర్చుకోవాలని, ప్రతిరోజూ వ్యాయామం, నడకకు ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. విద్యార్థులకు పలు విషయాలపై సలహాలు ఇచ్చి వారితో కలిసి ఫొటోలు దిగారు. ఎమ్మెల్యే తమతో ఆప్యాయంగా మాట్లాడటంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>