ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి: బీజేవైఎం డిమాండ్

కలం, నిర్మల్ : జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ క్షేత్రస్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదని బీజేవైఎం (Nirmal BJYM) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులు రోజుల తరబడి ఎదురుచూస్తున్నారని తెలిపారు. తేమ శాతం పేరుతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతుండగా, గన్నీ బ్యాగుల కొరత, రవాణా సౌకర్యాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలు కురిస్తే కల్లాల్లోని ధాన్యం తడిసి నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని, దిలావర్పూర్‌తో పాటు జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో యుద్ధప్రాతిపదికన ధాన్యం సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇర్ల విజయ్, అయిండ్ల సాత్విక్, దీక్షిత్ రెడ్డి పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>