కలం, వెబ్ డెస్క్ : పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఊటుకూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Palnadu Accident)లో ఇద్దరు అయ్యప్ప మాలధారులు ప్రాణాలు కోల్పోయారు. క్రోసూరుకు చెందిన దాడి పూర్ణచంద్ర (50), దగ్గుబాటి శ్రీనివాసరావు (48) అయ్యప్ప దీక్షలో ఉన్నారు. వీరు రాత్రి అమరావతి ఆలయానికి వెళ్లి అక్కడ నిద్రించి, తిరిగి స్వగ్రామమైన క్రోసూరుకు కారులో బయలుదేరారు. మార్గమధ్యంలో ఊటుకూరు వద్దకు రాగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు ఒరిగిపోయింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పూర్ణచంద్ర, శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందారు. అయ్యప్ప మాలధారణలో ఉండగానే వీరిద్దరూ మృత్యువాత పడటంతో క్రోసూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

