ఆగిఉన్న లారీని ఢీకొన్న థార్.. నలుగురు దుర్మరణం!

కలం, వెబ్ డెస్క్ : విజయనగరం జిల్లా భోగాపురం మండలం సుందరపేట సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం (Bhogapuram Accident) జరిగింది. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న థార్ కారు రోడ్డుపై ఆగి ఉన్న లారీ ట్యాంకర్‌ను ఢీకొట్టింది.

ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరొకరిని స్థానికులు వెంటనే సుందరపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>