కలం, జోగులాంబ గద్వాల: కేటీదొడ్డి మండలంలోని వెంకటాపురంలో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం (Venkatapuram Temple)లో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. వేడుకల అనంతరం సోమవారం ఆలయం హుండీల లెక్కింపు నిర్వహించారు. దేవాదాయ శాఖ గద్వాల డివిజన్ పర్యవేక్షకురాలు వెంకటేశ్వరి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్, పెద్దలు, ఆలయ సిబ్బంది, మహిళా భక్తుల సమక్షంలో లెక్కింపు చేపట్టారు. నోట్ల రూపంలో రూ.9,48,640, నాణేల రూపంలో రూ.1,02,266 కలిపి మొత్తం రూ.10,50,906 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ పురేందర్ కుమార్ తెలిపారు. హుండీలో బంగారం, వెండి కానుకలు లభించలేదన్నారు.

