పోడు పట్టాల పేరుతో మోసం.. కలెక్టరేట్‌ ఎదుట నిరసన

కలం, నిర్మల్: పోడు భూముల సర్వే, పట్టాల మంజూరు(Podu Land Pattas Scam) పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేశారంటూ కడెం మండలం లక్ష్మీసాగర్‌ గ్రామానికి చెందిన బాధితులు సోమవారం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామంలో పోడు భూముల సర్వే నిర్వహించి పట్టాలు ఇప్పిస్తామనే పేరుతో సుమారు 300 మంది నుంచి పంచాయతీ కార్యదర్శి షేక్‌ మోబిన్‌ పాషా అక్రమంగా డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. డబ్బులు చెల్లించకపోతే పోడు భూములకు పట్టాలు రావని చెప్పడంతో నమ్మి నగదు ఇచ్చామని తెలిపారు.

డబ్బులు చెల్లించిన అనంతరం పట్టాల విషయమై అడగగా, ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారని, త్వరలోనే అందరికీ పట్టా పాస్‌బుక్కులు ఇప్పిస్తానని నమ్మించారని పేర్కొన్నారు. చివరకు తాము మోసపోయామని గుర్తించిన గ్రామస్తులు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తూ డీఎల్‌పీవో విచారణ చేపట్టాలని కోరారు. బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బులను వెంటనే తిరిగి ఇప్పించాలని, అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పంచాయతీ కార్యదర్శిపై సమగ్ర విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>