నిరుపేద కుటుంబాలకు బీమా రక్షణ కల్పించడమే లక్ష్యం: ఎమ్మెల్యే కూనంనేని

కలం, ఖమ్మం బ్యూరో : అనుకోని ఆపద సమయంలో నిరుపేద కుటుంబాలకు ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ (Indiramma Family Life Insurance Scheme) కొండంత అండగా నిలుస్తుందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం చుంచుపల్లి మండల పరిధిలోని విద్యానగర్ గ్రామపంచాయతీలో నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు, స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ​ఈ సందర్భంగా బీమా నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే, అనంతరం లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. అకాల మరణాలు సంభవించినప్పుడు బాధిత కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోకుండా బీమా సొమ్ము భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు. ​లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీతో ప్రభుత్వ సంక్షేమ సేవలు మరింత సులభతరమవుతాయని కూనంనేని వివరించారు.

అర్హులైన ప్రతి ఒక్కరూ బీమా పథకంలో పేర్లు నమోదు చేసుకునేలా అధికారులు గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. నమోదు ప్రక్రియలో ఎక్కడా జాప్యం లేకుండా పారదర్శకంగా అర్హులందరికీ ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాల ఫలాలు సమాజంలోని చిట్టచివరి అర్హుడికి చేరినప్పుడే వాటి లక్ష్యం నెరవేరుతుందని ఆయన స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలో విద్యానగర్ సర్పంచ్ శాంతిశ్రీ, ఉపసర్పంచ్ వాసిరెడ్డి మురళి, తహసీల్దార్ నాగరాజు, పంచాయతీ కార్యదర్శి కె. వెంకటేశ్వర్లు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>