కలెక్టరేట్‌ ఎదుట లబ్ధిదారుల గోడు.. ఇళ్ల కోసం ఆందోళన

కలం, నిర్మల్: నాలుగున్నరేళ్లు గడిచినా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కేటాయింపులో(2BHK House Allotment) ఎలాంటి కదలిక లేకపోవడంతో టోకెన్లు పొందిన లబ్ధిదారులు సోమవారం నిర్మల్‌ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. సిద్ధాపూర్‌–కౌట్ల (కె) గ్రామాల మధ్య సుమారు రూ.31.80 కోట్ల అంచనా వ్యయంతో 25 బ్లాకుల్లో 600 కుటుంబాల కోసం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించినట్లు తెలిపారు. అధికారులు సర్వే నిర్వహించి నాలుగున్నరేళ్లు గడిచినా ఇళ్ల పంపిణీ చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికే ముగ్గురు కలెక్టర్లు మారినా తమ సొంతింటి కల నెరవేరడం లేదని వాపోయారు. టోకెన్లు అందజేసినప్పటికీ ఇళ్ల కేటాయింపులో జాప్యం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించి తమ సొంతింటి కలను నెరవేర్చాలని కోరారు. లేనిపక్షంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ భవనాలపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>