కలం, వెబ్ డెస్క్: హీరోయిన్ త్రిష (Heroine Trisha) వివాదంలో చిక్కుకున్నారు. తిరునల్వేలిలో ‘ఇళయ పురుచ్ఛి తలైవి త్రిష పేరవై’ పేరుతో కొత్త ఫోరం ఏర్పాటు చేయడమే ఇందుకు కారణం. తమిళనాడులో ‘పురుచ్ఛి తలైవి’ అంటే రెవెల్యూషనరీ లీడర్ అని అర్థం. దివంగత మాజీ సీఎం జయలలితను మాత్రమే ఈ బిరుదుతో పిలుస్తుంటారు. ఇప్పుడు త్రిష ఫ్యాన్స్ ఆమెను యంగ్ పురుచ్ఛి తలైవిగా సంబోధిస్తూ.. ఫోరం ఏర్పాటు చేయడంపై జయలలిత ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పేరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇది జయలలితను అవమానించడమేనని మండిపడుతున్నారు. జయలలిత, త్రిష మధ్య అనేక పోలికలున్నాయని, అందుకే ఆ పేరుతో ఏర్పాటు చేసినట్లు ఫోరం నిర్వాహకులు చెప్పుకొచ్చారు.
త్రిష నుంచి నో రెస్పాన్స్..
తన పేరుతో ఒక ఫోరం ఏర్పాటు చేయడంతో వివాదం మొదలైన నేపథ్యంలో ఇప్పటివరకు త్రిష స్పందించలేదు. గతంలో కూడా ఆమె రాజకీయాల్లోకి రాబోతున్నారని.. రావాలంటూ తమిళనాడులో వివిధ చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా, పట్టించుకోలేదు. అయితే విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం త్రిష ఆయనతో కలిసి పలు అధికారిక కార్యక్రమాల్లో కూడా కనిపించడంతో రకరకాలుగా చర్చ ప్రారంభమైంది. దీనిపై కూడా ఆమె క్లారిటీ ఇవ్వలేదు. త్రిష, విజయ్ మధ్య సంబంధం, చెలరేగిన వివాదం చివరికి ఉదయనిధి స్టాలిన్ను అరెస్ట్ చేసేవరకు తీసుకెళ్లింది. ఇప్పుడు జయలలిత బిరుదు మీద ఫోరం ఏర్పాటు చేయడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

