ధ్రువ్​ రాఠీకి ఢిల్లీ కోర్టు షాక్​.. నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

కలం, వెబ్ డెస్క్​: ప్రముఖ యూట్యూబర్​ ధ్రువ్​ రాఠీకి (Dhruv Rathee) ఢిల్లీ కోర్టు (Delhi Court) షాక్​ ఇచ్చింది. ఓ కేసులో అతను కోర్టుకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాన్​–బెయిలబుల్​ వారెంట్​ జారీ చేసింది. రాఠీ 2018లో నిర్మించి తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన “బీజేపీ ఐటీ సెల్ పార్ట్ II” అనే వీడియోపై వికాస్ సంస్కృతియాన్ పరువు నష్టం దావా వేసింది.

ఈ కేసులో ఇప్పటికే అతడి (Dhruv Rathee)పై బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయితే, విచారణకు ధ్రువ్ రాఠీ కానీ, ఆయన తరఫు న్యాయవాది కానీ హాజరు కాలేదు. దీంతో సాకేత్ కోర్టు ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అమన్ రైస్ ఖాన్ ధ్రువ్​ రాఠీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. తదుపరి విచారణను డిసెంబర్ 3వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా, “బీజేపీ ఐటీ సెల్ పార్ట్ II” అనే వీడియోలో సంస్కృతియాన్ ప్రతిష్టను దెబ్బతీయడానికి.. బీజేపీ ఐటీ సెల్ సభ్యులు అతనికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని రాఠీ ఆరోపించారు. ఆ తర్వాత సంస్కృతియాన్, ఆ ఆరోపణలు అవాస్తవమైనవని తన ప్రతిష్టకు భంగం కలిగించే ఉద్దేశ్యంతో చేసినవని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>