కలం, హనుమకొండ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు దమ్ముంటే హన్మకొండ నుంచి పోటీ చేయాలని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి( Naini Rajender Reddy) సవాల్ విసిరారు. జూటా మాటలు మానుకోవాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం ఆపాలని హితవు పలికారు.
ఆదివారం బీఆర్ఎస్ నిర్వహించిన జన చైతన్య సభకు కౌంటర్‌గా కాంగ్రెస్ నాయకులు సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హన్మకొండ, వరంగల్ ప్రాంతాల అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు. అభివృద్ధి పేరుతో ప్రజలకు మోసపూరిత హామీలు, మాటలు చెప్పారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుతో పాటు ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

