దారుణం.. సింగరేణి ఉద్యోగిని కత్తులతో పొడిచి హత్య!

కలం, వెబ్​ డెస్క్​: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణ హత్య జరిగింది. సింగరేణి ఉద్యోగి అట్ల రాజశేఖర్​ (30)ని గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి చంపారు (Singareni Employee Murder). పవర్ హౌస్ కాలనీలో సోమవారం ఉదయం చోటు చేసుకున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు అట్ల రాజశేఖర్​ కు ఫోన్​ చేసిన యువకులు బయటకు రప్పించారు. ఆయన బయటకు రాగానే ఆటోలో వచ్చిన నలుగురు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశారు. అనంతర అక్కడి నుంచి పరారయ్యారు.

మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, హత్య (Singareni Employee Murder)కు గల కారణాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>