కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో ఉగ్రదాడి జరుగుతుందంటూ వచ్చిన బాంబు బెదిరింపులపై (Hyderabad Bomb Threats) గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ బ్లాస్ట్ బెదిరింపులను తెలంగాణ ప్రభుత్వం తేలికగా తీసుకోవద్దని సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా కోరారు. సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ, ఇంటెలిజెన్స్ విభాగం దృష్టి సారించాలన్నారు. 26/11 తరహా దాడి చేసేందుకు హైదరాబాద్ లో ఉన్న స్లీపర్ సెల్స్ పాకిస్తాన్ టెర్రరిస్టులకు సహాయం చేస్తారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాతబస్తిలో ఎక్కువ సంఖ్యలో స్లీపర్ సెల్స్ ఉన్నారని రాజాసింగ్ ఆరోపించారు. 1993లో ముంబైలో జరిగిన దాడుల మాదిరిగానే హిందువులే టార్గెట్ గా ఈ పేలుళ్లకు ప్లాన్ చేశారని ఆయన తెలిపారు. హైదరాబాద్ లో హిందువులు ఎక్కువ సంఖ్యలో ఎక్కడ ఉంటారో ఆ ప్రాంతాలను మొదట గుర్తించి అక్కడ పేలుళ్లకు ప్రణాళిక చేస్తారని చెప్పారు. ఎక్కడ బ్లాస్ట్ చేస్తే ఎక్కువ మంది హిందువులు చనిపోతారో టెర్రరిస్టులకు ఇక్కడ ఉన్న స్లీపర్ సెల్స్ సమాచారం అందిస్తారని వ్యాఖ్యానించారు. బాంబు దాడి బెదిరింపులపై (Hyderabad Bomb Threats) పోలీసులు, ప్రభుత్వం విచారణ చేపట్టి వార్నింగ్ మెయిల్ పంపిన వాళ్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ కోరారు.

