అలర్ట్.. బంగాళాఖాతంలో మరో రెండు తుఫాన్ల ముప్పు!

కలం, వెబ్ డెస్క్ : ఇటీవల సంభవించిన ‘అక్వాన్’, ‘ మురసు’ తుఫాను ప్రభావం నుంచి కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌కు (AP Cyclone Alert) వాతావరణ నిపుణులు మరో కీలక హెచ్చరిక జారీ చేశారు. రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో వరుసగా మరో రెండు తుఫాన్లు ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ నెలాఖరుకు దక్షిణ అండమాన్ సముద్రంలో ఒక అల్పపీడనం ఏర్పడి, అది క్రమంగా బలపడుతూ తుఫానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. డిసెంబర్ మొదటి వారం తర్వాత ఈ తుఫాను శ్రీలంక, దక్షిణ తమిళనాడు తీరాల వైపు కదిలే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీనికి తోడు డిసెంబర్ రెండో వారంలో బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడే అవకాశం కూడా ఉందని వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ప్రస్తుత అంచనాల ప్రకారం ఒకవేళ వాతావరణ పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే, ఆ తర్వాత మూడో తుఫాను ఏర్పడే అవకాశాలు ఉండవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ రెండు సంభావ్య తుఫాన్ల దిశ, తీవ్రత, అవి తీరం దాటే ప్రాంతాలపై ఇప్పుడే ఒక స్పష్టమైన అంచనాకు రావడం కష్టమని అంటున్నారు. ఏపీ తీర ప్రాంతాలపై వీటి ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది అల్పపీడనం ఏర్పడిన తర్వాతే తెలుస్తుందని, అప్పటివరకు ప్రజలు, ముఖ్యంగా రైతులు, మత్స్యకారులు ఆందోళన చెందకుండా వాతావరణ శాఖ అందించే రోజువారీ అధికారిక బులెటిన్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>