ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా .. ఎప్పుడంటే?

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (AP Cabinet Meeting) తేదీలో కీలక మార్పు చోటుచేసుకుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26వ తేదీన జరగాల్సిన కేబినెట్ భేటీని ఒక రోజు వాయిదా వేస్తూ నవంబర్ 27వ తేదీకి మార్చారు. గతంలో వివిధ కారణాలతో నిలిచిపోయిన 23 పట్టణ స్థానిక సంస్థలకు 26వ తేదీన పోలింగ్ నిర్వహించనున్న నేపథ్​యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న మంత్రి మండలి సమావేశం మధ్యాహ్నం 1 గంటకు ‘హైబ్రిడ్ విధానంలో’ నిర్వహించాలని నిర్ణయించింది.

కాగా, నవంబర్ 27న మధ్యాహ్నం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులు ఎన్నికల విధులు, క్షేత్రస్థాయి పర్యటనల్లో నిమగ్నమై ఉన్నందున, అందరికీ అందుబాటులో ఉండేలా హైబ్రిడ్ మోడ్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అందిన ప్రతిపాదనలను సాధారణ పరిపాలన శాఖ క్రోడీకరిస్తుండగా, ఈ భేటీలో తీసుకునే కీలక నిర్ణయాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>