కారు ఇవ్వ‌లేద‌ని పెళ్లికి నో చెప్పిన పోలీస్!

క‌లం, వెబ్‌డెస్క్‌: క‌ట్నం కింద తాను కోరిన‌ కారు ఇవ్వలేద‌నే కార‌ణంతో వ‌రుడు పెళ్లిని ర‌ద్దు చేసుకున్న‌ ఘ‌ట‌న హ‌ర్యానా రాష్ట్రంలోని సోనిప‌ట్‌ (Sonipat Police)లో జ‌రిగింది. ఢిల్లీకి చెందిన‌ పోలీస్ కానిస్టేబుల్ (Police Constable) కుల్దీప్‌కు సోనిపట్‌కు చెందిన సుభాష్ కుమార్ కుమార్తె హీనాతో వివాహం నిశ్చ‌య‌మైంది. వరుడి కుటుంబం కారుతో పాటు 2 తులాల బంగారు గొలుసు, తల్లికి 4 తులాల క‌మ్మ‌లు, ఇతర బంధువులకు ఆభరణాలు డిమాండ్ చేసింది. అయితే, వధువు కుటుంబం తమ ఆర్థిక స్థోమతకు తగ్గట్టుగా రూ. 9.5 లక్షల విలువైన హ్యుందాయ్ ఆరా కారును బుక్ చేశారు. పెళ్లికి ఒకరోజు ముందు వరుడు తనకు బ్రెజా కారు మాత్రమే కావాలని పట్టుబట్టాడు.

వరుడి డిమాండ్ మేరకు వధువు తరపు వారు ఆరా కారు బుకింగ్‌ను రద్దు చేసి బ్రెజా కోసం ప్రయత్నించారు. సమయం లేకపోవడంతో పెళ్లి రోజుకు దానిని ఏర్పాటు చేయలేకపోయారు. దీంతో ఆగ్రహించిన కుల్దీప్, అతని కుటుంబ సభ్యులు వివాహ వేదిక వద్ద గొడవకు దిగి పెళ్లిని రద్దు చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్ల కోసం రూ. 25 నుంచి రూ. 30 లక్షల వరకు ఖర్చు చేశామని వధువు తండ్రి సుభాష్ కుమార్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వరుడు కుల్దీప్, అతని తల్లి, సోదరుడు, వదినతో పాటు ఇద్దరు మధ్యవర్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోనిపట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీంతో వ‌రుడు కుల్దీప్ తీరుపై నెటిజ‌న్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బాధ్య‌తాయుత‌మైన పోలీస్ శాఖ‌లో ప‌ని చేస్తూ ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం ఏమిటని మండిపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>