బోనకల్‌లో హక్కుల పరిరక్షణపై సీపీఎం నేతల చర్చ

కలం, బోనకల్: ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ పేదలు, కార్మికులు, రైతులు, కూలీల హక్కుల పరిరక్షణ కోసం కమ్యూనిస్టుల పాత్ర మరింత కీలకమని సీపీఎం నేత కొండేటి అప్పారావు అన్నారు. ఆదివారం బోనకల్ (Bonakal) మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో స్టడీ సర్కిల్ కన్వీనర్ తెల్లాకుల శ్రీనివాసరావు అధ్యక్షతన ‘మారుతున్న గ్రామీణ జీవన విధానం – కమ్యూనిస్టుల ఆవశ్యకత’ అనే అంశంపై పార్టీ నేతలు చర్చించారు.

ఈ సందర్భంగా కొండేటి అప్పారావు మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరగడం, సాగు ఖర్చులు అధికమవడం, పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడం, గ్రామీణ ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం వంటి సమస్యలు రైతులు, వ్యవసాయ కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. గ్రామాల్లో యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేక పట్టణాలు, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయాలకే పరిమితం కావొద్దు..

ఇలాంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టు ఉద్యమం కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా సమాజంలో జరుగుతున్న పరిణామాలను అధ్యయనం చేయాలని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, ప్రజాస్వామ్య విలువలు, సమానత్వం, సామాజిక న్యాయం పట్ల అవగాహన కల్పించడం కమ్యూనిస్టుల బాధ్యత అని పేర్కొన్నారు.

పుస్తక పఠనం, చర్చలు, స్టడీ సర్కిళ్ల ద్వారా సిద్ధాంతపరమైన అవగాహన పెంపొందించుకోవాలని, నేర్చుకున్న విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వివరించారు. ఈ కార్యక్రమంలో నేతలు కిలారు సురేష్, బంధం శ్రీనివాసరావు, బూర్గుల అప్పచారి, బొప్పాల రమేష్, జొన్నలగడ్డ సునీత, నాగులువంచ కామ్రేడ్ రౌతు అప్పారావు, చామర్తి వెంకటేశ్వర్లు, పొన్నం నాగేశ్వరరావు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>