ధర్మ పరిరక్షణే వీహెచ్‌పీ లక్ష్యం: కన్న శివకుమార్

కలం, నారాయణపేట: ధర్మ పరిరక్షణ చేయడమే విశ్వహిందూ పరిషత్ (VHP) లక్ష్యమని జిల్లా కార్యదర్శి కన్న శివకుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోనీ పళ్ళ హనుమాన్ మందిరం వద్ద ఆదివారం హిత చింతక్ అభియాన్ (విశ్వహిందూ పరిషత్ సభ్యత్వ నమోదు) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి భజనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు విశ్వహిందూ పరిషత్ ఆవిర్భవించిందన్నారు. హిందువులలో ఐక్యత, సంఘటన నిర్మాణమే లక్ష్యమన్నారు. బలవంతపు మతమార్పిడులకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు ధర్మ పోరాటం చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ హిందూ సమాజంపై అవగాహన పెంపొందించుకున్నప్పుడే మన లక్ష్యం సాధించిన వారమవుతామ‌ని పేర్కొన్నారు.

లవ్ జిహాదీ పట్ల విశ్వహిందూ పరిషత్ కఠినంగా వ్యవహరిస్తుందని స్ప‌ష్టం చేశారు. ప్రతి ఒక్కరు గోరక్షణ చేయాలని పిలుపునిచ్చారు. హిందువుల ఐక్యతతోనే అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. మూడేళ్లకోసారి విశ్వహిందూ పరిషత్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి 10 మంది విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలతో సభ్యత్వ నమోదు చేయించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మ్యాడమ్ ప్రభాకర్, పట్టణ అధ్యక్షులు మురళి భట్టడ్, రామచంద్రయ్య, సందీప్ మిస్కిన్, కడుదాస్ ప్రవీణ్, రాజ్ శేఖర్, ఉశప్ప, అరవింద్, ఆకాష్, రాఘవ, ఉమాదేవి, స్వాతి, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>