కలం, వెబ్‌డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని మథురలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో(Mathura Wedding) భారీ నగదు బహుమతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇద్దరు పెళ్లికొడుకులకు వారి బావ ఏకంగా రూ.2 కోట్ల విలువైన కరెన్సీ నోట్ల దండలను (Currency Note Garlands) బహుమతిగా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. ఒక్కో నోట్ల దండ 100 అడుగుల పొడవుతో ఉండగా, ఒక్కో దండలో కోటి రూపాయల విలువైన రూ.500 నోట్లు ఉన్నట్లు సమాచారం. దీంతో పెళ్లి వేడుకలో నోట్ల దండల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బావ ఇచ్చిన రూ.2 కోట్ల బహుమతి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

