కలం, అచ్చంపేట: పార్టీ క్రమశిక్షణ లక్ష్మణ రేఖ దాటిన ఇద్దరు ఎమ్మెల్యేలపై తమకు ఫిర్యాదులు అందాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి (Mallu Ravi) స్పష్టం చేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన ఎమ్మెల్యే వంశీ కృష్ణతో కలిసి విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన ఇద్దరు ఎమ్మె ల్యేల వ్యవహారంపై టి పిసిసి అధ్య క్షులు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లినట్టు తెలిపారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డిలు ఇటీవల ప్రభుత్వ పని తీరుపై బహిరంగంగా విమర్శలు చేసిన అంశం తన దృష్టికి పలువురు పార్టీ పెద్దలు తీసుకొచ్చా రని మల్లు రవి తెలిపారు.
పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాల్సిన అంశాలను బహిరంగ వేదికలపై, మీడియా ముందు మాట్లాడడం పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమని ఆయన అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన ఏఐసీసీ ఇన్చార్జి సందీప్ కుమార్ దృష్టికి కూడా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లినట్లు చెప్పా రు. అయన ఇరువురు ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడాలని ఆదేశించారని తుది నిర్ణయం ఏఐసీసీ కార్యదర్శి సందీప్ కుమార్ తీసుకుంటారని స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) లో ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారంపై విస్తృతంగా చర్చించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి తాను కూడా హాజరవుతానని ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ ఈనెల 26వ తేదీన అచ్చంపేట నియోజకవర్గం పదర మండలం మద్దిమడుగు క్షేత్రానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారని అనంతరం సాయంత్రం ఐదు గంటలకు అచ్చంపేటలో బహిరంగ సభ నిర్వహించనున్నారని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

