కలం, వెబ్ డెస్క్: అధిష్ఠానం ఆదేశాలే ఎవరికైనా ఫైనల్ అని, తాను కూడా వంద శాతం పాటిస్తానని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జిగా నియమితులైన బీఎం.సందీప్ (BM Sandeep) తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో.. గాంధీ భవన్‌లో పరిచయం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. మంచిని మైక్‌లో, చెడును చెవిలో చెప్పాలని చురకలంటించారు. సీఎంతో కూడా ఇబ్బందులు ఉంటే ఇన్‌ఛార్జి సందీప్‌కు చెప్పుకోవచ్చన్నారు. కలిసి కూర్చుని సమస్యలను పరిష్కరించుకుందామని.. బయట కామెంట్స్ చేయడం వలన పార్టీకే నష్టం జరుగుతుందన్నారు.
అన్నీ ప్రాజెక్టులకు అప్పుడే పునాది..
కొత్త ఇన్‌ఛార్జి బీఎం.సందీప్ ఎన్నికలు అయిపోయేంత వరకు ఉంటారని.. ఆయన ఆధ్వర్యంలో పార్టీ నేతలు సమష్టిగా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో ఒక్క ప్రాజెక్ట్ కూడా చేపట్టలేదన్నారు. కానీ, బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అబద్ధాలు ప్రచారం చేస్తోందన్నారు. 2022లో కేసీఆర్, జగన్ ఉన్నప్పుడే పల్నాడు వాటర్ గ్రిడ్ పథకం మొదలైందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. పోతిరెడ్డిపాడు కూడా వైఎస్ మంత్రివర్గంలో అప్పటి టీఆర్ఎస్ భాగస్వామిగా ఉన్నప్పుడే ప్రారంభించారన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను నిరంతరం తిప్పికొడుతుండాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు.
Also Read : ప్రభాస్‌తో కిషన్ రెడ్డి సమావేశం..!
Follow Us On: Youtube

