బైకర్ నిర్లక్ష్యం.. ఒకరి మృతి, 12 మందికి గాయాలు

కలం, వెబ్ డెస్క్ : కాకినాడ జిల్లా పరిధిలోని చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి NH-16పై బైకర్ నిర్లక్ష్యం కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం (Kakinada Road Accident) చోటుచేసుకుంది. ఒక బైకర్ అకస్మాత్తుగా, నిర్లక్ష్యంగా రోడ్డు దాటే ప్రయత్నం చేయడంతో విశాఖపట్నం వైపు వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. బైకర్‌ను తప్పించే క్రమంలో కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ పెను ప్రమాదానికి ప్రధాన కారణమైన బైకర్ మాత్రం కనీసం ఆగకుండా ఘటనా స్థలం నుంచి పరారైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేసి, పరారైన బైకర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>