ఏడేళ్ల ప్రేమకు బ్రేకప్.. ప్రియురాలి ఇల్లు తగలబెట్టిన యువకుడు!

కలం, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలోని డోంబివలి (Dombivli)లో ప్రేమ విఫలమైందన్న కోపంతో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. దీపేష్ రస్తోగి అనే వ్యక్తి గత ఏడెనిమిదేళ్లుగా ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఇటీవల ఆ యువతి తమ బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని దీపేష్, ఆగ్రహంతో ఆమె ఇంటికి నిప్పు పెట్టాడు.

ఆ సమయంలో యువతితో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా ఇంట్లోనే ఉన్నారు. అదృష్టవశాత్తూ మంటలు వ్యాపించకముందే కుటుంబ సభ్యులందరూ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న మన్పాడ పోలీసులు నిందితుడు దీపేష్ రస్తోగిని అరెస్టు చేశారు. యువతితో పాటు ఆమె కుటుంబాన్ని హతమార్చే ఉద్దేశంతోనే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>