మానసిక వికలాంగుల పాఠశాలలో ఉచిత కంటి అద్దాల పంపిణీ

కలం, కరీంనగర్: తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్, ఎల్‌ఎండీ కాలనీలోని కరీంనగర్ జిల్లా స్వాతంత్య్ర సమరయోధుల ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల, వృత్తి విద్యా శిక్షణ కేంద్రంలో ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి, సిద్దిపేట వారి ఆధ్వర్యంలో, నాట్కో ఫార్మా ఆర్థిక సహకారంతో ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Chitra Mishra) పాల్గొన్నారు. ఎల్.వి. ప్రసాద్ ఆసుపత్రి ప్రతినిధులు వంశీధర్, జతిన్, ఎల్లారెడ్డిపేట గౌట్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ హమ్మద్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ.. ట్రస్టు చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి, ట్రస్టు సభ్యులు, ఉపాధ్యాయులు మానసిక వికలాంగుల పిల్లలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. పిల్లలకు ప్రభుత్వం తరఫున ప్రతిరోజూ ఉదయం టిఫిన్ అందిస్తామని, పాఠశాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. 110 మంది ఉచితంగా కంటి అద్దాలు పొందామని వారు చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేనేజంగ్ ట్రస్టీ బొజ్జపురి వెంకటయ్య,ట్రస్ట్ సభ్యులు గాజుల భగవాన్, గుర్రం కొముర ఎల్లారెడ్డి,అశోక్ ముఖర్జీ,మధుసూదన్ రావు తేరాల సత్యనారాయణ, రమణారెడ్డి,ఏవో ఈ బాలరాజు, పాఠశాల ప్రిన్సిపాల్ నాంపల్లి సతీష్, VTC ఇన్స్ట్రక్టర్ వి రమేష్ , ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల పెరెంట్స్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>