పోలీస్ బ్యాడ్మింటన్‌లో తెలంగాణ జోడీ విజయం

క‌లం, స్పోర్ట్స్: గుజరాత్‌లో జరుగుతున్న 3వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్ (Police Badminton) క్లస్టర్ పోటీలు మూడో రోజుకు చేరుకున్నాయి. శనివారం ఒక్కరోజే బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ విభాగాల్లో మొత్తం 328 మ్యాచ్‌లు జరగనున్నాయి. అహ్మదాబాద్‌లోని వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా పోటీలు కొనసాగుతున్నాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో తెలంగాణ క్రీడాకారిణులు సత్తా చాటారు. టేబుల్ టెన్నిస్ ఎన్‌జీఓ 40 ప్లస్ మహిళల డబుల్స్ విభాగంలో తెలంగాణకు చెందిన ఆకుల స్వప్న, కరంగుల పద్మిని జోడీ 3-0తో మిజోరాం జోడీపై విజయం సాధించింది.

ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు, 10 కేంద్ర పోలీస్ సంస్థలకు చెందిన 38 జట్ల నుంచి 1,150 మందికి పైగా పోలీసు సిబ్బంది పాల్గొంటున్నారు. ఇందులో 890 మంది పురుషులు, 272 మంది మహిళలు ఉన్నారు. నవంబర్ 19న గుజరాత్ డీజీపీ జ్ఞానేంద్ర సింగ్ మాలిక్ ఈ పోటీలను ప్రారంభించారు. పోలీసు సిబ్బందికి శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం కూడా క్రీడల ద్వారా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆరు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలు నవంబర్ 24న ముగియనున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>