కలం, మునుగోడు: చండూరు (Chandur) హై స్కూల్లో శనివారం జన విజ్ఞన వేదిక చెకుముకి మండల స్థాయి పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ధ్రువపత్రాలు, జ్ఞాపికల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టీఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ బొబ్బల వెంకట్ రామ్ రెడ్డి, ఎస్సై శివకుమార్, మున్సిపల్ కమిషనర్ మల్లేశం, ఎంఈవో సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మూడు రోడ్ల వద్ద నిమ్మకాయలు, కోడి గుడ్లు, అన్నం తిప్పివేయటం వంటి వాటితో ఏమి కాదన్నారు. దెయ్యాలు, భూతాలు అన్ని కూడా అభూత కల్పనలు అని వివరించారు.
చేతబడులు, బానామతులను పట్టించుకోవాల్సిన పనిలేదని తెలిపారు. భక్తి అంటే క్రమశిక్షణ అని భక్తికి మూఢ నమ్మకానికి చాలా వ్యత్యాసం ఉందని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం కోటేశ్వర్‌రెడ్డి, జన విజ్ఞాన వేదిక (జేవీవీ) డివిజన్ అధ్యక్షుడు, సీనియర్ పాత్రికేయుడు రాపోలు ప్రభాకర్, మండల అధ్యక్షుడు, సీనియర్ పాత్రికేయుడు సంగేపు మల్లికార్జున్, సీనియర్ స్కూల్ అసిస్టెంట్ ఎస్.విజయలక్ష్మి, కళ్లెం వెంకట్‌రెడ్డి, సుధీర్‌బాబు, కరుణాకర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, సతీష్, శ్రీను పాల్గొన్నారు.

