డబ్ల్యూపీఎల్ టాలెంట్‌కు గుర్తింపు.. టీమిండియాలోకి యువ స్టార్లు

క‌లం, స్పోర్ట్స్: ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత మహిళల అండర్-19 జట్టును (WPL) ప్రకటించారు. ఈ జట్టుకు భావికా అహిరే కెప్టెన్‌గా, అనాది తగ్దే వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ద్వారా వెలుగులోకి వచ్చిన యువ సంచలనాలు ఉమా కాశ్వి, దీయా యాదవ్‌లకు ఈ జట్టులో చోటు దక్కింది. గత అక్టోబర్ 28న కొచ్చిలో జరిగిన డబ్ల్యూపీఎల్ 2027 వేలంలో కర్ణాటక ఆల్‌రౌండర్ కాశ్వి చరిత్ర సృష్టించింది. 15 ఏళ్ల 202 రోజుల వయసులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆమెను రూ.10 లక్షలకు దక్కించుకుంది. తద్వారా డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఎంపికైన అత్యంత పిన్న వయస్కురాలిగా ఆమె నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు దీయా యాదవ్ పేరిట ఉండేది.

గత వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎంపికైన దీయా, 2026 జనవరిలో ముంబై ఇండియన్స్‌పై 16 ఏళ్ల 103 రోజుల వయసులో అరంగేట్రం చేసి రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు వీరిద్దరూ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. 2025 అండర్-19 ప్రపంచకప్ విజేత జట్టులో సభ్యులైన భావికా అహిరే, ఈశ్వరి అవ్సారే కూడా ఈ జట్టులో ఉన్నారు. 2027 జనవరి 21 నుంచి ఫిబ్రవరి 6 వరకు బంగ్లాదేశ్, నేపాల్ వేదికలుగా జరగనున్న అండర్-19 టీ20 ప్రపంచకప్‌కు ఈ సిరీస్ సన్నాహకంగా ఉపయోగపడనుంది. నవంబర్ 26న వడోదరలో తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. డిసెంబర్ 6న సూరత్‌లో జరిగే ఐదో టీ20తో పర్యటన ముగుస్తుంది. ఈ సిరీస్‌లో యువ క్రీడాకారిణులు ఎలా రాణిస్తారో వేచి చూడాలి.

భారత అండర్-19 జట్టు:

భావికా అహిరే (కెప్టెన్, వికెట్ కీపర్), ఇరా జాదవ్, నిధి మహతో, పూర్వా సివాచ్, మెహక్ నర్వాసే, మైత్రి మణియార్, ఈశ్వరి అవ్సారే, దీయా యాదవ్, శ్రేయ ఎస్ చవాన్ (వికెట్ కీపర్), సమైరా రాఘవ్, కుమారి పాలక్, ఉమా కాశ్వి, అచ్చా పర్మార్, అనాది తగ్దే (వైస్ కెప్టెన్), పాలక్ సింగ్.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>