కావ్య, అనిరుధ్ రిసెప్షన్.. చెన్నైలో సందడే సందడి

కలం, వెబ్ డెస్క్: కావ్య మారన్ (Kavya Maran), అనిరుధ్ రవిచందర్ రిసెప్షన్ చెన్నైలో సందడిగా జరుగుతోంది. ఈ వేడుకకు దేశ వ్యాప్తంగా సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాల ప్రముఖులు తరలివచ్చారు. కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ.. కానుకలు అందించారు. రిసెప్షన్‌కు హాజరైనవారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సీఎం రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత, మంత్రి లోకేష్‌తో పాటు హీరో మహేశ్ బాబు తదితరులున్నారు. ఇక తమిళనాడు సీఎం విజయ్ హాజరై.. వధూవరులకు హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. సూపర్‌స్టార్ రజినీకాంత్ వేడుకలో మరో ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

డీఎంకే అధినేత స్టాలిన్, ఏఐడీఎంకే అధ్యక్షుడు పళనిస్వామి, నటుడు కమల్ హాసన్ తదితరులు బోకేలు అందించి విష్ చేశారు. కావ్య అనిరుధ్‌(Kavya Maran – Anirudh)ల పెళ్లి ఇటీవలే గ్రీస్‌లో జరగగా.. చెన్నైలోని ఐటీసీ హోటల్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ ఏకైక కుమార్తె కావ్య మారన్ పలు రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని ఆమెనే. మరోవైపు, అనిరుధ్ కోలీవుడ్, టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నారు.

Also Read : ఐఐటీ ఖరగ్‌పూర్‌కు గూగుల్ భారీ విరాళం

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>