గాంధీ ఆసుపత్రిలో కిడ్నాప్ కలకలం

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి (Gandhi Hospital)లో కిడ్నాప్ కలకలం రేపింది. ఏడు రోజుల పసికందును కిడ్నాప్ చేసిన నస్రీన్ అనే మహిళ.. రూ.లక్ష తీసుకుని పిల్లలను అక్రమ రవాణా చేసే ముఠాకు అమ్మేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. మూడో కాన్పులోనూ ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుసుకున్న నస్రీన్ .. పాప తల్లిదండ్రులను మాటల్లో పెట్టింది. తమకు ఇచ్చేస్తే డబ్బులు వస్తాయని ఆశ చూపించారు. వారు కూడా అంగీకరించడంతో డబ్బులు ఇచ్చేసి పాపను తీసుకెళ్లిపోయారు.

ఈ విషయం బయటకు పొక్కడంతో వెంటనే పోలీసులు అప్రమత్తమై.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సరగడ హేమలతతో పాటు ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ రక్షితా మూర్తి తెలిపారు. దీని వెనుక పెద్ద ముఠా ఉందని అనుమానిస్తున్నారు. కిడ్నాప్ ఘటనతో గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital)లో భద్రత మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Also Read : ఇందిరమ్మ బీమాకు మార్గదర్శకాలు విడుదల

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>