66 కిలోల సిందూరం తొలగింపు.. నిజరూపంలో హనుమాన్ దర్శనం!

కలం, సోన్: శ్రీరాంసాగర్ జలాశయం నిర్మాణ సమయంలో ముంపునకు గురైన సోన్ మండలంలోని న్యూ బొప్పారం (New Bopparam) గ్రామంలో 1972లో నిర్మించిన హనుమాన్ ఆలయానికి (Hanuman Temple) ప్రత్యేక చరిత్ర ఉంది. ఆలయం నిర్మించిన నాటి నుంచి గ్రామస్తులు స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా కార్తిక పౌర్ణమి సందర్బంగా హనుమాన్ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు. ఆలయ నిర్మాణం పూర్తయి 54 సంవత్సరాలు కావడంతో స్వామివారికి అలంకరించిన సిందూరాన్ని శనివారం తొలగించారు.

సుమారు 66 కిలోల సిందూరాన్ని తొలగించడంతో హనుమంతుడు నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం తొలగించిన సిందూరాన్ని గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం ఒడిబియ్యం సమర్పణ, బుధవారం హనుమాన్ పండుగ, ఉట్టికొట్టే కార్యక్రమంతో పాటు అన్నదానం నిర్వహించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వామి, ఉదయ్, అజయ్, తోట ఉదయ్, వినయ్, సతీష్, గణేష్, శివ, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.

Also Read : ఇందిరమ్మ బీమాకు మార్గదర్శకాలు విడుదల

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>